ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ ఇంటి ప్రహరీ గోడ కూల్చేసిన వైసీపీ నేతలు

ETV Bharat / videos

YCP leaders Anarchy వైసీపీ నేతల కక్ష సాధింపు.. న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత - YCP leaders demolished reporter house

By

Published : Jul 22, 2023, 10:49 PM IST

YCP leaders demolished reporter house wall: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అంతం అనేది లేకుండా పోతోంది. రోజు రోజుకి వారి దురాక్రమాలు పెరిగిపోతున్నాయి. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు లేదా దాడులు లేదా ఏదో ఒక సాకు చెప్పి ఇళ్లు కూల్చేస్తారు.. తాజాగా అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌ మండలం ఉద్దేహల్‌లో.. న్యూస్ టుడే  కంట్రిబ్యూటర్ ఇంటి ప్రహరీ గోడ, బాత్ రూమ్‌ను  వైసీపీ నాయకులు పడగొట్టారు. వైసీపీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నానంటూ.. గతంలోనే  బెదిరింపులకు పాల్పడ్డారని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ప్రహరీ గోడను కులుస్తున్నారని పోలీసులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పోలీసుల ఎదుటనే జేసీబీతో కులదోస్తున్నా.. ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల కిందట నిర్మించిన ఇంటికి.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పదివేల రూపాయలు చెల్లించి హక్కులు పొందన్నారు. గతంలో వైసీపీ నాయకులు బెదిరింపులతో  దుకాణదారులతో పాటు తానూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు చూపినా ఇంటి ప్రహరీ గోడ, బాత్‌రూం కూల్చినట్లు ఆరోపించారు.  

ABOUT THE AUTHOR

...view details