ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_leader_land_grab

ETV Bharat / videos

YCP Leader land Grab in Nellore District: దారి కబ్జాతో 100 ఎకరాలను ఆక్రమించిన వైసీపీ నేత.. ఆత్మహత్యే శరణ్యం అంటున్న బాధితుడు - వైసీపీ నాయకుల అరాచకాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 6:55 PM IST

Updated : Sep 24, 2023, 7:55 PM IST

YCP Leader land Grab in Nellore District:పొలాలకు వెళ్లే దారిని వైసీపీ నేత ఆక్రమించండంతో న్యాయం చేయాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఓ బాధితుడు వాపోతున్నాడు. నెల్లూరు జిల్లాలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మర్రిపాడు మండలం ఏపీలగుంట గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని.. సుమారు 100 ఎకరాల భూమిని వైసీపీ నేత రసం రామకృష్ణారెడ్డి ఆక్రమించాడని బాధిత రైతు శ్రీనివాసులు ఆరోపిస్తున్నాడు. శ్రీనివాసులు అనే వ్యక్తిని తన పొలానికి వెళ్లనివ్వకుండా వైసీపీ నేత రామకృష్ణారెడ్డి వేదింపులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా పొలాల పరిశీలించడం తప్ప న్యాయం చేయడం లేదంటూ వాపోయాడు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దారి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కాళ్లపై పడి వెడుకున్న న్యాయం చేయలేదని బాధితుడు తెలిపారు. ఇకనైనా ఉన్నత అధికారుల జోక్యంతో తన పొలానికి వెళ్లే దారి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యంమని వాపోతున్నాడు.

Last Updated : Sep 24, 2023, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details