Liquor: మద్యం సీసాలో పురుగులు.. ఆరోగ్యం పాడవుతుందన్న మందుబాబులు - గుంటూరులో మద్యం సీసాలో పురుగులు
Worms In Liquor Bottle: మేము తాగేది కల్తీ మందు.. అందులోనూ ధర ఎక్కువ.. కల్తీ మద్యంతోనే ఆరోగ్యం పాడవుతోందంటే...! ఇప్పుడు అంతకు మించి ఏకంగా మద్యం సీసాల్లో పురుగులు ఉన్న మందును అమ్మటం వల్ల తాగి అనారోగ్యం బారిన పడనున్నామని అంటున్నారు మద్యం ప్రియులు.
గుంటూరు జిల్లా నంది వెలుగు రోడ్డులోని... మణికంఠ హోటల్ పక్కన వున్న మద్యం దుకాణం నందు కొనుగోలు చేసిన మద్యం సీసాలో పురుగులు వుండటం మందుబాబులో కలవరం మొదలైంది. పొద్దంతా కష్టపడి ఒళ్ళు నొప్పులతో బాధ పడుతున్న మాకు.. మద్యం సేవిద్ధాం అని వస్తే... దుకాణాల్లో ఇలాంటి పురుగులు వున్న మద్యం అమ్మటం వల్ల.. మా లాంటి వారు తాగి అనారోగ్య పాలవుతున్నాం అంటూ తక్కెలపాడుకు చెందిన సాగర్, అనిల్ వాపోతున్నారు. నాణ్యత లేని మద్యాన్ని రకరకాల బ్రాండ్ల పేరుతో మద్యం షాపుల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. గతంలో ఉన్న మద్యం బ్రాండ్లనే కొనసాగించాలి... మాకు ఈ పురుగులు కలిసిన మద్యం వద్దు అని... తక్కెలపాడు మున్సిపాలిటీ కి చెందిన సాగర్, అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.