World Photography Day Celebrations in Vijayawada: "ఫొటో లేకుండా పేపర్ చదివితే ఫొటో జర్నలిజం విలువ తెలుస్తుంది" - photo exbhition in vijayawada
World Photography Day Celebrations in Vijayawada: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం ఫొటో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. ఫొటో లేకుండా పేపర్ చదివితే ఫొటో జర్నలిజం విలువ తెలుస్తుందని, ఫొటో చూసే ఆ వార్తను మనం అర్ధం చేసుకోవచ్చన్నారు. ఫొటోగ్రఫీకి అంత ప్రాధాన్యత ఉందన్నారు. ఫొటో జర్నలిస్టుల కోసం లక్ష రూపాయలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం 15 లక్షల రూపాయల నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్నా తమ దగ్గరికి వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.