ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Womens_Protest_in_Mummidivaram

ETV Bharat / videos

Womens Protest in Mummidivaram Sub-Registrar Office: మా ఇళ్లు, ఖాళీ స్థలాలను ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారు: మహిళలు - Mummidivaram Sub Registrar Office news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 10:38 PM IST

Womens Protest in Mummidivaram Sub-Registrar Office: తాము నివాసం ఉంటున్న ఇళ్లను, ఖాళీ స్థలాలను తమ ప్రమేయం లేకుండా ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారంటూ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం ఎదుట కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ.. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేయాలని మహిళలు డిమాండ్‌ చేశారు. 

Victims Womens Comments:''మేము నివాసం ఉంటున్న మా గృహాలు, మాకు చెందిన స్థలాలను మా ప్రమేయం లేకుండా మరొకరికి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని గత రెండు నెలలుగా రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాము. కానీ, మాకు న్యాయం చేయడం లేదు. అందుకే కార్యాలయంలో ముందు బైఠాయించి నిరసనకు దిగాము. రోజువారి కూలీకి వెళ్తే గానీ మాకు పూట గడవదు. అటువంటిది కోర్టుకెెళ్లి తేల్చుకోమంటున్నారు. మా వద్ద అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు. కావాలనే గ్రామంలోని కొంతమంది ఇలా చేస్తున్నారు'' అని బాధిత మహిళలు కన్నీంటిపర్యంతమయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details