ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Woman_Kidnapped_By_Brothers

ETV Bharat / videos

ఆస్తి కోసం సోదరిని కిడ్నాప్​ చేసిన సోదరులు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ - ఆస్తి తగాదాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 1:49 PM IST

Woman Kidnapped By Brothers :ఆస్తి వివాదంలో ఓ మహిళను సమీప బంధువులే కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు, కదిరి పట్టణం జవుకుపాలెంవీధిలో నివాసముండే బీబీజాన్​ను ఆమె సోదరులు, వారి సంతానం బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. బీబీజాన్ పేరిట ఆమె తల్లి భూమిని రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ భూమిలో కుమారులైన తమకు వాటా ఇవ్వాలంటూ కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి ఉన్నంత వరకు ఆస్తిలో వాటా ఇచ్చేది లేదంటూ బీబీజాన్ తేల్చి చెప్పారు.

Woman Kidnapped for Property :తమ మాటను దక్కించుకోవాలని ఉద్దేశంతో ఆమెను సమీప బంధువులు ఇంట్లో నుంచి బలవంతంగా లాకెళ్లి ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మహిళ అపహరణను స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. "కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు" అంటూ మహిళ బంధువులు స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ మహిళను కదిరి మండలం ముత్యాల చెరువుకు తీసుకెళ్లి నిర్బంధించి, కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను నిర్బందం నుంచి విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. కాగా మహిళను ఆటోలో ఎత్తుకెళ్లి దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details