Vijayawada Loyola Students Congratulations to ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాక్షాంక్షలు తెలిపిన.. విజయవాడ లయోలా విద్యార్థులు - చంద్రయాన్ 3 తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 5:45 PM IST
Vijayawada Loyola Students Congratulations to ISRO: జాబిల్లిని చేరుకునేందుకు చంద్రయాన్-3 ప్రయాణం 41 రోజులు సాగింది. జులై 14న శ్రీహరికోట నుంచి LVM3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ను ప్రయోగించగా అది జాబిల్లిని చేరుకోవడానికి ఇస్రో పలు విన్యాసాలను చేపట్టింది. కక్ష్య పెంపు, తగ్గింపు విన్యాసాలను విజయవంతగా చేపట్టి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరువ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది. అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అగ్రపథాన నిలవాలని యావత్తు విశ్వసం ఆకాంక్షిస్తోంది. విక్రమ పరాక్రమాన్ని వీక్షించేందుకు ఉద్వేగ్నింతో ఎదురుచూస్తోంది. చంద్రునిపై చందమామ ఉపరితలం వేదికగా భారత వైజ్ఞానిక సత్తా ప్రదర్శనకు సమయం సమీపిస్తోంది. ఓ మహోన్నత ఘట్టాన్ని చూసేందుకు యువతరం వేయికళ్లతో నిరీక్షిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపుతోన్న తొలిదేశంగా భారతావని పేరు చరిత్ర పుటల్లో నమోదయ్యే మధురఘట్టానికి- ఇస్రో శాస్త్రవేత్తల అకుంఠదీక్ష, శ్రమకు విజయవాడ లయోలా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు శుభాకాంక్షలు చెప్పారు.