ఆంధ్రప్రదేశ్

andhra pradesh

varla_ramaiah_comments

ETV Bharat / videos

జైళ్లలో మగ్గుతున్న వారి కోసం కమిషన్​తో విచారణ జరిపించాలి: వర్ల రామయ్య - కోడికత్తి కేసు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:04 PM IST

Varla Ramaiah Comments on Cock Knife Case: జైళ్లలో మగ్గుతున్న దళిత ఖైదీలకు అన్యాయం జరుగుతోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కమిషన్​ను వేసి విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్​ చేశారు. చిన్న చిన్న కేసుల్లో జైళ్లకు వెళ్లి సంవత్సరాల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్న కేసులో కోడికత్తి శీను ఎందుకు ఐదున్నరేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలని కోరారు. కోడికత్తి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతితో త్వరలో దిల్లీలోని కేంద్ర ఎస్సీ కమిషన్​ను కలుస్తామని వర్ల రామయ్య తెలిపారు. వారిని కూడా ఓ కమిషన్​ వేయమని కోరుతామన్నారు. దళితులందరూ కలిసి దళిత వ్యతిరేక ముఖ్యమంత్రికి బుద్ది చెప్పాలన్నారు. ప్రశ్నించలేని వారిని పార్లమెంటుకు పంపించి ముఖ్యమంత్రి ఆనందం పొందుతున్నాడని వర్ల వ్యాఖ్యానించారు. ప్రశ్నించ లేనివాడిని పార్లమెంటుకు పంపించి సీఎం జగన్​ గొప్పగా చేసినట్లుగా ఆనందాన్ని పొందుతున్నాడని దుయ్యబట్టారు.   

ABOUT THE AUTHOR

...view details