Vangaveeti Radha Engagement: నరసాపురంలో నిరాడంబరంగా వంగవీటి రాధా నిశ్చితార్థం - వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 9:30 PM IST
Vangaveeti Radha Engagement: దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నిడారంబరంగా జరిగింది. మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా నిశ్చితార్థ వేడుక నరసాపురంలో జరిపారు. ఈ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువుల్ని, నర్సాపురం ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులని మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థం కాగానే పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారు.
నిశ్చితార్థాన్ని నిరాడంబరంగా జరిపించినా.. వివాహాన్ని మాత్రం ఘనంగా నిర్వహించాలని రెండు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలిసింది. అక్టోబర్ 22 రాత్రి 7.59 గంటలకు పెళ్లికి శుభ ముహూర్తాన్ని పండితులు ఖరారు చేశారు. పెళ్లి ఎక్కడ అన్నది ఇంకా నిర్ణయించలేదు. నిశ్చితార్థ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు , మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన నాయకులు కోటికిలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్ తదితరులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.