వృద్ధురాలి అనుమానాస్పద మృతి - ఆస్తి కోసమే అంతమొందించారా?! - crime nandyala district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 4:54 PM IST
Unknown Persons Killed the Old Woman : నంద్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. స్థానిక ఎన్జీవో కాలనీ సమీపంలో హౌసింగ్ బోర్డులో ఒంటరిగా నివాసం ఉంటున్న గ్లాడిస్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ రోజు ఉదయం పని మనిషి వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. గ్లాడిస్ను ఎంత పిలిచినా పలకపోవడం వల్ల ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇంటి తాళాన్ని పగల గొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్ రూమ్లో గ్లాడిస్ మృత దేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Police Have Registered a Case : నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో గ్లాడిస్, సుధాకర్ అనే దంపతులు కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. సుధాకర్ దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తూ నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. వారికి ఇద్దరు కుమారైలు. గత ఏడాది సుధాకర్ రావు మృతి చెందడం వల్ల అప్పటి నుంచి ఒంటరిగానే నివసిస్తోంది. ఇప్పుడు గ్లాడిస్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమె ఆస్తి, డబ్బు కోసం హత్య చేసి ఉంటారా, లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.