పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది: కేంద్ర మంత్రి షెకావత్ - గజేంద్రసింగ్ షెకావత్ కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 9:45 PM IST
Union Jal Shakti Minister Gajendra Singh Shekhawat: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని.. ఏపీ ప్రభుత్వం పెంచిందని, సవరించిన అంచనాలను గత నెల 19న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని... జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నివేదిక రాగానే కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. ఇప్పటికి.. పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులు రాష్ట్రం వద్ద ఉన్నాయని షెకావత్ తెలిపారు. పునరావాస అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తుందని, కేంద్రం పర్యవేక్షణ మాత్రం చేస్తుందని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ నీటిపారుదల, మురుగునీటి పారుదల కాంగ్రెస్ సదస్సు పాల్గొనడానికి వచ్చిన గజేంద్ర షెకావత్ విశాఖ బీజేపీ కార్యాలయాన్ని కాసేపు సందర్శించారు. విశాఖకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ను రాజస్థాన్ మండలి సమితి సత్కరించింది.