వేర్వేరు ప్రాంతాల్లో రెండు కార్లు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం - viral videos
Car Caught Fire: రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో.. రెండు కార్లు దగ్ధమయ్యాయి. కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన నంద్యాల జిల్లా డోన్‌లో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పక్కనున్న మరో కారును చాకచక్యంగా తప్పించారు. దీంతో ఆ కారుకు ప్రమాదం తప్పింది. భారీ మంటలు చెలరేగడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బం దికి సమాచారమిచ్చినా.. సకాలంలో ఘటనా స్థలానికి రాకపోవడంతో మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
అలాగే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికేడు సమీపంలో హైవేపై కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. ఏలూరు నుంచి విజయవాడ వస్తున్న సమయంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.