TTD EO Dharma Reddy on Tirumala Navaratri Brahmotsavam 2023: "15 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి" - TTD Tirumala Navaratri Brahmotsavam 2023
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 5:40 PM IST
TTD EO Dharma Reddy on Tirumala Navaratri Brahmotsavam 2023 Arrangements :తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేమస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని, ఈ సారి సెలవులు ఉండటంతో అశేషంగా భక్తులు వస్తారని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. నేడు స్థానిక అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను (Tirumala Navaratri Brahmotsavam Starts From October 15th) వైభవంగా నిర్వహిస్తామన్నారు.
TTD Tirumala Navaratri Brahmotsavam 2023 :19వ తేదీ రాత్రి కీలక ఘట్టమైన గరుడవాహన సేవ జరుగుతుందన్నారు. గరుడ సేవను 6.30 గంటలకే ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. అర్చకులతో సంప్రదింపులు జరిపి.. గరుడ సేవ ఎన్ని గంటలకు మొదలు అవుతుందో తెలుపుతామన్నారు. దసరా సెలవులు దృష్ట్యా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, రద్దీకి అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు సిఫార్సు లేఖలపై వీఐపీ, బ్రేక్ దర్శనాలు, అన్ని వెసులుబాటు దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. నాలుగు మాడ వీధుల్లో భక్తులను అలరించేందుకు 15 రాష్ట్రాల నుండి కళాకారులను పిలిపిస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు.