TRAFFIC IN PADERU: పాడేరు ఘాట్‌రోడ్ వ్యూపాయింట్ వద్ద ట్రాఫిక్ జాం... - పాడేరు వార్తలు
TRAFFIC ON PADERU GHAT ROAD : పాడేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ సమీపంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద లారీకి రెండు వైపులా సుమారు 2 కిలో మీటర్ల మేర.. సుమారు 30 నిమిషాల పైనే వాహనాలు ఎక్కడివక్కడ నిలిపోయాయి. ఈ రహదారిపై అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. ఒక్కసారిగా వాహనాల మధ్య చిక్కుకుపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన సమయంలో గమ్య స్థానాలకు చేరుకోవడానికి వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కాలినడకన ప్రయాణం కొనసాగించారు. మరికొందరు అలాగే వాహనాల్లో ఉండిపోయారు. జిల్లా అయిన తర్వాత రద్దీ మరింత ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలు తరచూ నిలిచిపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురవుతోందని వారు వాపోతున్నారు.