ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Toll_Plaza_Managers_Increased_Toll_Booths

ETV Bharat / videos

హైదరాబాద్​కు తిరుగు పయనమైన ఆంధ్రవాసులు - కీసర టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ - Keesara Toll Plaza

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 9:05 PM IST

Toll Plaza Managers Increased the Toll Booths: రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేడుకలు ముగిశాయి. కుటుంబాలతో కలిసి చిన్నాపెద్దా అంతా ఈ నాలుగు రోజులూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి పురస్కరించుకుని సొంతూళ్లకు వచ్చిన ఆంధ్రవాసులు పండుగ ముగియటంతో హైదరాబాద్​కు తిరిగి పయనమయ్యారు. దీంతో రహదారిపై రద్దీని నివారించేందుకు టోల్​ ప్లాజా నిర్వాహకులు టోల్ బూత్ (Toll Booths)​లను పెంచారు.

Traffic Jam At Vijayawada Hyderabad National Highway: విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇతర వృత్తుల్లో హైదరాబాదులో ఉంటున్న వారంతా పండుగ ముగియటంతో కార్లు, బస్సులు, ఇతర వాహనాలతో భాగ్యనగరం బాట పట్టారు. ఫలితంగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి (Vijayawada Hyderabad National Highway) రద్దీగా మారింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం (Kanchikarla Mandal) కీసర టోల్ ప్లాజా (Keesara Toll Plaza) వద్ద వాహనాల రద్దీ అదుపు చేయటం కోసం ప్లాజా నిర్వాహకులు టోల్ బూత్​లను పెంచారు.

ABOUT THE AUTHOR

...view details