Prathidhwani: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకిచ్చిన హామీ గుర్తుందా..?
Prathidhwani: అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుని,చదువుని పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామి ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ఇదే మాట చెప్పారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రతీ మాట రాజకీయ పార్టీలు నిలబెట్టుకోవాలని లేదంటే.. ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి పోయే పరిస్థితి తీసుకురావాలని గొప్పలు పోయారు. అయితే అధికారంలోకి రాగానే దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది వైసీపీ ప్రభుత్వం. అసలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎప్పుడూ.. సమాన పనికి సమాన వేతనం అని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకునేదెప్పుడు..? కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మిగిలిన వారితో పోల్చితే పీఆర్సీ, ఇతర సౌకర్యాల అమలు ఎలా ఉంది? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల కోసం ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన ఆప్కాస్ వ్యవస్థలోనైనా వారికోసం కనీస రక్షణలు కల్పించారా? దీనిపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ జరగబోతుంది.