ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Thief_Died_Accidentally_in_East_Godavari

ETV Bharat / videos

దొంగతనానికి వెళ్లిన వ్యక్తిని వెంటాడిన మృత్యువు - మూడు రోజుల తర్వాత! - thief news in east godavari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 4:33 PM IST

Thief Died Accidentally in East Godavari: ఓ వ్యక్తి దొంగతనం కోసం ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోనే కాకుండా చుట్టు పక్కన ఇళ్లలో ఎవరూ లేరు. అదృష్టం బావుంది దొరికిన కాడికి సర్దుకుని పారిపోదాం అనుకుని, మెల్లగా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని దురదృష్టం వెంటాడి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పొయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

Thief Died on Spot After Falling on Gate: నిడదవోలు గణపతి సెంటర్​లో తాళం వేసిన ఒక ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన సమయంలోో ఇంటి బయట ఉన్న ఇనప గేటు మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల ఇళ్లు కూడా తాళాలు వేసి ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. దీంతో ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చుట్టు పక్కల స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు రోజులు క్రితం సంఘటన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details