JEE Advanced Top Rankars Interview: జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్ ర్యాంకర్స్.. ఎలా చదివారంటే..? - ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్స్ ఇంటర్వ్యూ
JEE Advanced Top Rankars Interview: అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. 1, 2 ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10 స్థానాల్లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే సొంతం చేసుకుని అగ్రశ్రేణిలో నిలిచారు. మెరుగైన ప్రణాళికతో సబ్జెక్టులపై పట్టు సాధించి లక్షల మందిలో అగ్రస్థానాల్లో నిలిచారు. ప్రథమంగా.. రైతు బిడ్డలే జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. గుంటూరు జిల్లాకు చెందిన అఖిల భారత స్థాయి ఓపెన్ కేటగిరీలో ఏ.వీ.శివరాం 5వ స్థానంలో నిలవగా.. వై.వీ.మణిందర్ రెడ్డి 10వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకుండా చదివామని, అధ్యాపకులు సూచించిన ప్రణాళికను అనుసరించామని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ విద్యార్థులు. భవిష్యత్తులో కంప్యూటర్ నిపుణులుగా స్థిరపడటంతో పాటు.. సమాజానికి తమవంతుగా సేవ చేయాలనుకుంటున్నట్లు ఇంటర్వ్యూలో వారి మనోగతాన్ని ఇలా పంచుకుంటున్నారు..