ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చింతకాయల అయ్యన్న పాత్రుడు

ETV Bharat / videos

Ayyanna Patrudu Interview: వైసీపీ పాలనలోని అన్యాయాన్ని వివరించటానికే 'భవిష్యత్​కు గ్యారెంటీ యాత్ర': అయ్యన్న - Ayyanna Fires On YSRCP

By

Published : Jun 25, 2023, 12:15 PM IST

TDP Politburo Member Ayyanna on Bhavishyathu ku Guarantee: నాలుగేళ్ళ వైసీపీ అరాచక పాలనను ప్రజల్లో ఎండగట్టడానికే 'భవిష్యత్​కు గ్యారెంటీ' చైతన్య యాత్రను చేపట్టినట్లు టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నప్రాత్రుడు తెలిపారు. అధికార వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని ప్రతి ఇంటికి తెలియజేయాలని పూనుకున్నట్లు ఆయన వివరించారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. వ్యవసాయంపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని.. ఎరువుల ధరలు, కూలీ ఖర్చులు పెరిగియాన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందనే మాటిచ్చి.. ముఖ్యమంత్రి ఆ మాట విస్మరించాడని విమర్శించారు. నష్టాన్ని తట్టుకోలేక ప్రజలు పంట సెలవు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మోయలేని కరెంటు ఛార్జీలు, పెరిగిన గ్యాస్​ ధరలతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆర్థికంగా పైకి తీసుకు వస్తామని తెలపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికే ఈ యాత్ర నిర్వహిస్తున్నమంటున్న చింతకాయల అయ్యన్న పాత్రుడుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి 

ABOUT THE AUTHOR

...view details