TDP MLC Panchumarthi Anuradha Fires on CM Jagan Delhi Tour: "సీఎం జగన్కు సొంత ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు" - panchumarthi anuradha latest comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 12:41 PM IST
TDP MLC Panchumarthi Anuradha Fires on CM Jagan Delhi Tour: బిల్డప్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీకి వెళ్లి సాధించేది ఏంటనీ.. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల 1400 కోట్ల ప్యాకేజీ, పెట్రో కాంప్లెక్స్ వంటి పనులకు నిధులు ఏమయ్యాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటు చేసిన సదస్సులో.. సీఎం జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ ఆమె ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని నాశానం చేస్తున్న గంజాయిని.. వైసీపీ నాయకులు సాగు చేసి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే రోజుకొకరు గంజాయి భారిన పడి చనిపోతున్నారని పేర్కొన్నారు.
ట్రైబ్యునల్ గురించి ప్రధానిని కలవాల్సింది పోయి.. దిల్లీకి వెళ్లి మరీ లేఖ రాయటమేంటని ప్రశ్నించారు. రాయలసీమను ఎడారిలా మార్చే నిర్ణయాలు జరుగుతున్న కూడా ముఖ్యమంత్రి పట్టనట్లు ఉన్నారంటే.. దాన్నిబట్టి ఆయన రాయలసీమ ప్రజలకు చేస్తున్న అన్యాయమెంటో అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రికి సొంత ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శలు గుప్పించారు.