అక్రమ మైనింగ్‌పై జాయింట్ కలెక్టర్ నిలదీత - కలెక్టరేట్లో బైఠాయించిన టీడీపీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 2:38 PM IST
TDP Leaders Questioned Joint Collector on Illegal Mining:నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి మైనింగ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరికొంత మంది వెళ్లి అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అక్రమంగా మైనింగ్‌పై టీవీల్లో, పత్రికల్లో వస్తున్నా ఎందుకు అధికారులు పట్టించుకోడం లేదని నిలదీశారు.
మాజీ మంత్రి మూడు రోజులుగా అక్రమ మైనింగ్‌పై దీక్ష చేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సాక్ష్యాలుగా ఫోటోలు చూపిస్తూ, ఫోన్లో సమాచారం ఇచ్చి అక్రమంగా పనిచేస్తున్న యంత్రాలను పట్టుకుని సీజ్ చేయమని టీడీపీ నాయకులు అడ్డుగుతున్నా ఎందుకు అధికారులు కదలడం లేదని అడిగారు. అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రాంతంలో గిరిజనుల ఇళ్లు ఉన్నాయని, మైనింగ్ పేలుళ్లకు అవి దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ సమయంలో ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరని అధికారులను నిలదీశారు. మైనింగ్ అధికారి వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కలెక్టరేట్లో భీష్మించి కూర్చున్నారు.