Yarapathineni Fires on Jagan: 'రాయలసీమ గొంతు తడిపింది టీడీపీ.. గొంతులు కోసింది వైఎస్సార్సీపీ'
Yarapathineni Fires on Jagan: రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ఇతర పన్నులకు మూలం జే టాక్స్ వసూళ్లేనని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. సైకో పాలనలో నాలుగేళ్లగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్న ఆయన.. నరకం నుంచి విముక్తి పొందాలంటే ఏపీ నుంచి జగన్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నొక్కేది ఉత్తుత్తి బటన్లే అని.. పోలింగ్ బూత్‌లో బటన్ నొక్కి ఫ్యాన్ రెక్కలు విరగకొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లు నిర్వీర్యం చేసి పేదలెవ్వరూ బతకలేని పరిస్థితి తెచ్చారన్నారు. ఇంత సైకోలా తయారవుతాడని జగన్మోహన్ రెడ్డికి చదువు చెప్పిన గురువు కూడా ఊహించి ఉండరని యరపతినేని వ్యాఖ్యానించారు.
పోలీస్ శాఖను జగన్మోహన్ రెడ్డి మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కోసం కొందరు పోలీసులు ఇంతలా ఎందుకు పని చేయాలో ఆలోచించాలని కోరారు. వ్యవస్థల్ని చెడగొడుతున్న వ్యక్తి కుట్రల్లో పోలీసులు బలిపశువులు కావొద్దని హితవుపలికారు. రాజకీయ ఒత్తిళ్లకు తాడిపత్రి సీఐ బలైతే, పోలీసు అధికారుల సంఘం ఎందుకు నోరెత్తదని నిలదీశారు. ఖైదీ నెంబర్ 6093కి పోలీసులు సెల్యూట్ చేయాల్సిన పని లేదని అన్నారు. రాయలసీమ ప్రజల గొంతు చంద్రబాబు తడిపితే, జగన్మోహన్ రెడ్డి గొంతులు కోశారన్నారు.
TAGGED:
Yarapathineni Fires on Jagan