ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Varla Ramaiah

ETV Bharat / videos

Varla Ramaiah on Avinash arrest అవినాష్‌ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి.. సీఎం జగనే - viveka muder case news

By

Published : May 13, 2023, 8:09 PM IST

TDP leader Varla Ramaiah sensational comments on Cm Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని వర్ల రామయ్య ఆరోపించారు. అంతేకాదు,అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే వివేకా హత్య కేసు ముగిసిపోయినట్టు కాదని.. హూ కిల్డ్ బాబాయ్‌లోని ముద్దాయిలంతా బయటపడాలని వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు వర్ల రామయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''అవివాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న ఆ అజ్ఞాతశక్తి ఎవరు..?, జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలిచ్చిన ఆ అధికారం మొత్తాన్ని, అతనికున్న తేలివితేటల మొత్తాన్ని కూడా దేనికి ఉపయోగిస్తున్నారు ఈరోజునా..?, రాష్ట్ర సంక్షేమం కోసమేమైనా ఉపయోగిస్తున్నారని అనుకుంటున్నారా..? అదంతా పొరపాటు. జగన్ ముందున్న ఎకైక లక్ష్యం.. ఆయన సోదరుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చూడటమే లక్ష్యంగా అతను ముందుకెళ్తున్నాడు ఇది శోచనీయం. అతనే ఆ అజ్ఞాతశక్తి. సీబీఐ ఒక విషయం అడుగుతున్నాను..మిమ్మల్నిని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బందులపాలు చేశారు అది నాకు తెలుసు. కానీ, ఎందుకు మీరు అవినాష్ రెడ్డి విషయంలో మేనమేషాలు లెక్కపెడుతున్నారు..?.  అనినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో మీకూ అడ్డుపడుతున్న ఆ అజ్ఞాతశక్తి ఈ శక్తియేనా..!'' అని ఆయన అన్నారు.

అనంతరం పోలీసులు బాధ్యతను మర్చి.. అధికారపార్టీ సేవలో పునీతులు అవుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నేత సురేష్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. సురేష్‌ను కాళ్ల కింద పెట్టి నులిమిన డీఎస్పీ వెంకట రమణపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details