ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Kollu Ravindra Arrested

ETV Bharat / videos

TDP Leader Kollu Ravindra Fires on Police: గుడిలో పూజలు చేస్తుండగా.. టీడీపీ నేత కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు - TDP Leader Kollu Ravindra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 11:04 AM IST

TDP Leader Kollu Ravindra Fires on Police: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో సైకిల్‌ యాత్ర చేపట్టారు. బందరు కోట దేవాలయంలో పూజలు చేసేందుకు వచ్చిన కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ ఇనుగుదురు సీఐ వి. వెంకటేశ్వరరావు ఆయనను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలన్నా.. అనుమతి తీసుకోవాలా అని మండిపడ్డారు. 

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నోటీసు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ.. రవీంద్ర ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఐ వెంకటేశ్వరరావుకు, ఆయనకు తీవ్ర వాగ్వాదం జరిగింది. గుడిలో ఉన్న తాను ఏ విధంగా ప్రజలకు, లా అండ్ ఆర్డర్​కు ఇబ్బంది కలిగిస్తానో పోలీసులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నేతల సేవలో తరిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details