ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Atchannaidu on Skill Development Agreement

ETV Bharat / videos

TDP Leader Atchannaidu on Skill Development Agreement: పవన్ పొత్తుల ప్రకటనతో.. సీఎం, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు: అచ్చెన్నాయుడు - మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 4:23 PM IST

Updated : Sep 16, 2023, 5:15 PM IST

TDP Leader Atchannaidu on Skill Development Agreement:  జగన్ ఆస్తుల కేసులో అధికారులను జైలుకు పంపిన పొన్నవోలు.. ఇప్పుడు స్కిల్ కేసులో అధికారులకేం సంబంధం అంటారేంటని తెలుగుదేశం  రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్(Skill Development) ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారంటూ మండిపడ్డారు. తమ దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగన్‌కు పంపుతామని తెలిపారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెడుతున్నారని ఏదో అంటున్నారని అచ్చెన్న ప్రశ్నించారు.  కెబినెట్ మీటింగ్ వెళ్లేటప్పుడు రిజస్టర్లో సంతకం చేసినా తప్పు అనేలా ఉన్నారంటూ అచ్చెన్నాయుడు (Atchannaidu)  ఎద్దేవాచేశారు. సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని నిలదీశారు. 

 గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స, ధర్మాన వంటి వారు ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఉన్నారన్న అచ్చెన్న.. వారేం అంటారని ప్రశ్నించారు. స్కిల్ కేసులో జగన్‌తో చర్చకు సిద్దమని లోకేశ్ సవాల్ విసిరారు, అందుకు సిద్దమా, ప్రస్తుతం లోకేశ్ దిల్లీలో ఉన్నారు వెళ్లి చర్చలో పాల్గొనగలవా అంటూ సవాల్‌ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి పవన్ చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయిందని అన్నారు. పవన్ పొత్తు ప్రకటన చేయగానే సీఎం జగన్, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.  

Last Updated : Sep 16, 2023, 5:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details