TDP ZONE-5 MEETING: కడపలో టీడీపీ జోన్-5 సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు - టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల వ్యాఖ్యలు
కడపలో ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జోన్-5 సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు కడప పుత్త ఎస్టేట్లో సమావేశం ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిశీలించారు. కార్యక్రమాన్ని 18వ తేదీ ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడపకు చేరుకొని సమావేశంలో మాట్లాడుతారని వెల్లడించారు. సమావేశానికి ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి దాదాపు 2700 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేవలం ప్రతినిధుల సభ మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కడప పెద్ద దర్గాలో జరిగే ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొంటారని, అక్కడి నుంచి రాత్రి బద్వేల్ కు బయలుదేరుతారని చెప్పారు. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.