ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Street Dogs Attack Small Girl Was Injured

ETV Bharat / videos

బాలికను వెంటాడిన వీధికుక్కలు - స్థానికుల చొరవతో సేఫ్ 'వీడియో వైరల్' - కుక్కల దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 5:10 PM IST

Street Dogs Attack Small Girl Was Injured:గుంటూరు నగరంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు వార్డులో ఆరేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. సంపత్ నగర్​లో ఉన్న కుక్కలు బాలిక వెంటపడటంతో భయంతో పరుగులు తీసింది. కొంతదూరం వెళ్లాక బాలికను కుక్కలు కరిచాయి. బాలిక కేకలతో స్థానికులు సకాలంలో స్పందించి కుక్కల్ని అక్కడి నుంచి తరిమివేశారు. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. 

ఆ ఘటన తర్వాత కూడా నగరపాలక సంస్థ అధికారులు సరిగా స్పందించలేదని స్థానికులు మండిపడ్డారు. అందువల్లే మళ్లీ వీధి కుక్కలు విజృంభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ వార్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మేయర్ సొంత వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరుస ఘటనల తర్వాత కూడా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని మేయర్​ను స్థానికులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details