Shri Saibaba Sansthan Trust: అనంత వాసికి కీలక పదవి అప్పగించిన మహారాష్ట్ర ప్రభుత్వం
Siva Shankar New CEO Of Shri Saibaba Sansthan Trust : అనంతపురం జిల్లా జనార్దనపల్లికి చెందిన పీ.శివ శంకర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. పీ.శివ శంకర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్టు... శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. గతంలో ఆయన షిర్డీ సాయి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని నిర్వహిస్తారు.
బాధ్యతలు చేపట్టిన తొలి రోజు పీ.శివ శంకర్ షిర్డీ సాయినాథున్ని దర్శించుకున్నారు. సాధారణ భక్తుల వలే 3 గంటలు క్యూలైన్‌లో నిలుచుని సాయిబాబా దర్శనం చేసుకున్నారు. అక్కడకు చేరుకున్న ఆలయ సిబ్బంది వీఐపీ దర్శనం చేసుకోవాలని సూచించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు బాబాను దర్శించుకునేందుకు గంటలు తరబడి వేచి చూస్తున్నారనీ.. ఆ సమస్యపై దృష్టి పెడతానని పీ.శివ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.