అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చేయి చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్ - వీడియో వైరల్ - Shiva Insulted Prabhavati Went To The Stock Point
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 12:12 PM IST
Shiva InsultedPrabhavati Went To The Stock Point: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ గ్రామంలో పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారుగా(Deputy Tahsildar of Civil Supplies) పనిచేస్తున్న ప్రభావతి స్టాక్ పాయింట్లో ప్రైవేటుగా పనిచేస్తున్న శివ అనే వ్యక్తిపై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. సోమందేపల్లి, రొద్ధం, పెనుగొండలో పౌరసరఫరాల దుకాణాలను పరిశీలించే పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారుగా ప్రభావతి పనిచేస్తోంది. పెనుగొండలో స్టాక్ పాయింట్లో ప్రైవేటు వ్యక్తిగా పనిచేస్తున్న శివ ప్రభావతిని నవంబర్ 29వ తేదీ బుధవారం అసభ్యంగా దూషించడంతో స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లి శివపై ప్రభావతి చేయి చేసుకుంది.
ఈ వ్యవహరమంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ విషయమే అధికారులు ప్రభావతికి ఫోన్ చేసి సంప్రదించగా శివపై భౌతిక దాడికి పాల్పడింది వాస్తవమేనని అతను అసభ్యంగా మాట్లాడటం వల్ల కోపం తట్టుకోలేక చేయి చేసుకున్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.