SSA Contract Employees: కొత్త వారిని ఎలా తీసుకుంటారు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
SSA Contract Employees Agitation : ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్లో పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అగ్గి రాజేసింది. ప్రస్తుతం పని చేస్తున్న తమను కాదని.. కొత్త వారి కోసం ఎలా నోటిఫికేషన్ ఇస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చెప్పిన వారికి సర్వ శిక్షా అభియాన్లో పోస్టులు ఇస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగాలను తమకే కేటాయించాలని కాంట్రాక్టు ఉద్యోగులు అనంతపురంలో గురువారం ఆందోళనకు దిగారు. తమతో రూ.12 వేల జీతంతో పని చేయించుకోని.. ప్రస్తుతం రూ.25 వేలు వేతనమని నోటిఫికేషన్ ఇవ్యడం ఏంటని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రోస్టర్ విధానం పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమగ్ర శిక్షా అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని ఉద్యోగులు హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనతో గురువారం జరుగుతున్న కౌన్సిలింగ్ను అధికారులు నిలిపివేశారు.