ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Sarpanch and five Ward Members Resign

ETV Bharat / videos

Sarpanch and Ward Members Resign to YSP: ఎమ్మెల్యే ఇబ్బందులు తట్టుకోలేక.. వైసీపీకి మహిళా సర్పంచ్ రాజీనామా - ఏపీలో వార్డమెంబర్స్ వైసీపీ సర్పంచ్ రాజీనామా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 9:35 PM IST

YCP Sarpanch and Five Ward Members Resign:  తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామ సర్పంచ్ నల్లమిల్లి సావిత్రి, ఆమె భర్త నల్లమిల్లి అబ్బన్న రెడ్డి, అయిదుగురు వార్డు సభ్యులతో కలిసి వైసీపీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా ఎమ్మెల్యే తమను దూరంగా ఉంచుతున్న కారణంగానే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే తమ సంబంధీకులు గ్రామ పంచాయతీపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా.. వారి చెప్పినట్టే నడుచుకోవాలంటున్నారు. తమకు సర్పంచ్ పదవితో పాటు అయిదుగురు వార్డు సభ్యుల బలం ఉందని తెలిపారు. అయితే, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులకు ఉపసర్పంచి పదవి ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఉపసర్పంచ్ పదవి ఇవ్వకపోతే.. తమ చెక్ పవర్ రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఏ ఒక్క ఎమ్మెల్యేతో ఇబ్బందులు రాలేదని... కానీ నేడు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details