రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు - ఏపీ సంక్రాంతి వేడుకలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 3:56 PM IST
Sankranthi Celebrations at CM Jagan House : భోగి మంటల వలె చెడును దహనం చేసి, సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని, ఆనందంగా ప్రతి ఒక్కరూ ముందడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఊరూ వాడా ఒక్కటై, బంధు మిత్రులు ఏకమై సంబరాలు జరుపుకొనే తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి అని జగన్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రపంచంలోని తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు.
సీఎం దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో తొలుత గోమాతను పూజించి, సారె అందించారు. ఉన్నతాధికారులు, వైఎస్సార్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంబరాల కోసం ప్రత్యేక్యంగా తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో సెట్ రూపొందించారు. సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ముందుగా జగన్ దంపతులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి పూజలో పాల్గొన్నారు.