ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Roads_Damged_Due_to_Heavy_Floods_in_Andhra_Pradesh

ETV Bharat / videos

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సైక్లోన్​ - బీభత్సానికి ధ్వంసమైన రోడ్లు, ఇళ్లలోకి నీళ్లు, కూలిన వృక్షాలు - Transport Affected Due to Cyclone

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 6:31 PM IST

Roads Damged Due to Heavy Floods in Andhra Pradesh: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వర్షం మాత్రమే కాకుండా బలమైన ఈదురుగాలులు వీచిన విషయం తెలిసిందే. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో వరదలు ఉధృతంగా సంభవించాయి. వరదల ధాటికి వాగులు వంకలు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు తెగిపోయాయి. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల ధాటికి విద్యుత్​ స్తంభాలు సైతం నేలకొరిగాయి. 

రెండు రోజులుగా ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. వరద మంచెత్తడంతో తాగునీటికి కూడా ప్రజలు నానా అవస్థలను ఎదుర్కొన్నారు. పలు జిల్లాలో తాగునీరు లభించే ప్రాంతాల్లో వందల మీటర్ల దూరంలో క్యూలైన్లు కట్టిన పరిస్థితి నెలకొంది. వరద నీళ్లు ఇళ్లలోకి చేరి ఇంట్లో వస్తువులు పాడైపోయిన పరిస్థితి తలెత్తింది. తినడానికి ఆహారం లేక పస్తులుండాల్సిన దుస్థితిని పలు జిల్లాలో బాధితులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలుల బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

ABOUT THE AUTHOR

...view details