ఆంధ్రప్రదేశ్

andhra pradesh

vrevant_reddy_flexy_in_nandigama

ETV Bharat / videos

'చంద్రబాబు శిష్యుడు రేవంత్​రెడ్డి' - తెలంగాణ ముఖ్యమంత్రికి శుభాకాంక్షల వెల్లువ - రేవంత్​ రెడ్డి అభిమానులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 3:12 PM IST

Revant Reddy Flexy In Nandigama :తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా నందిగామ, వీరులపాడులో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులు అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరుల పేరిట శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫోటోలతో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. వీటిని నగరంలోని రోడ్లపై ఏర్పాటు చేశారు. 

Andhra Pradesh People Wishes To Revant Reddy :అదేవిధంగా నందిగామలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా చావా సతీష్, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బాబుకి అనుంగ శిష్యుడు, మేము మెచ్చిన డేరింగ్ డైనమిక్ లీడర్ రేవంత్ అన్నకు పట్టాభిషేకం అంటూ చంద్రబాబు రేవంత్ అనే అక్షరాలతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు స్థానిక సెంటర్లో ఉండటంతో స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details