Rayadurgam SBI Ex Manager Arrest ఖాతాదారుల సొమ్ము మళ్లింపు.. రాయదుర్గం ఎస్‌బీఐ పూర్వ మేనేజర్ అరెస్ట్ - ఏపీ క్రైం న్యూస్
Rayadurgam SBI Ex Manager Arrestఅనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ పూర్వ ఛీప్ మేనేజర్ ఎస్ఎల్ఎన్ ఫణికుమార్ను అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మన్న తెలిపారు. బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1.07 కోట్లు నగదును తన తల్లి, స్వంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమా చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడాడు. దీంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బ్యాంకు ఉన్నతాధికారులు అతనిపై ఫిర్యాదు చేశారు.
బ్యాంకు రీజనల్ అధికారులు అతనిపై వచ్చిన అవినీతి అక్రమాలను వెంటనే కనుగొని విచారణ చేపట్టారు. ఖాతాదారుల సొమ్మును బ్యాంకు అధికారులు రికవరీ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ రెండు టీంలు ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా వైజాక్, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు మహా నగరాల్లో ఉంటూ పోలీసులకు కళ్ళు కప్పి తప్పించుకొని తిరిగాడు.
ఎట్టకేలకు రాయదుర్గం సీఐ లక్ష్మన్న ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం పట్టణ సమీపంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద అతనిని అరెస్టు చేశారు. అనంతరం రాయదుర్గం పోలీసులు కళ్యాణదుర్గం మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట అతనిని హాజరు పరచగా, రిమాండుకు అదేశించినట్లు సీఐ వివరించారు.