ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తరగతి గదిలో వర్షపు నీరు గొడుగు నీడలో పాఠాలు

ETV Bharat / videos

Rain Water in Classroom: జగన్ మామయ్యా.. చూశారా మా కష్టాలు.. - Students protest as water enters ZP school

By

Published : Jul 26, 2023, 6:10 PM IST

Rain Water in Vissannapet Zilla Parishad High School Classroom: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులు వర్షానికి జలమయం అయ్యాయి. తరగతి గదులు చిన్నపాటి చెరువును తలపించాయి. క్లాస్‌ రూమ్‌పైన రేకులు పగిలిపోవడంతో గదినిండా వర్షం కురిసి.. నీళ్లు చేరాయి. చిన్నారులు తడవకుండా గొడుగులు వేసుకొని కూర్చొవలసిన పరిస్థితి ఏర్పడింది. వాన నీటిలో పాములు, జెర్రులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదులు నిర్మించాలని పిల్లలు వేడుకుంటున్నారు. తరగది గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులే నీటిని బయటకు చిమ్ముతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించ లేదు. నాడు-నేడు ద్వారా సుమారు 66 లక్షల రూపాయలతో పనులు చేసినప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తున్నామని నాలుగు సంవత్సరాలుగా ఊదరగొడుతున్న జగన్‌ మామయ్యకు ఈ తరగతి గది ఎందుకు కనిపించలేదో అర్థం కావడం లేదని పిల్లలు వాపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details