R Narayana Murthy University Telugu Movie: విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజ్ ఘటనల ఆధారంగా 'యూనివర్సిటీ': ఆర్.నారాయణమూర్తి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 7:58 PM IST
R Narayana Murthy University Telugu Movie: ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను, పేపర్ లీకేజ్ ఘటనల ఆధారంగా యూనివర్సిటీ సినిమా రూపొందించామని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా అనంతపురం నగరంలో యూనివర్సిటీ చిత్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా చిత్రం గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ... యూనివర్సిటీ సినిమా అనేది తన 32వ చిత్రం అని.. అక్టోబర్ 6 లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇది పూర్తిగా సందేశాత్మక సినిమా అన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం వ్యాపారం అయ్యిందని.. తమ సంస్థల్లో చదివితేనే ఉద్యోగాలు వస్తాయి.. గొప్పవాళ్లు అవుతారన్న అపోహను విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పిస్తున్నారన్నారు. పేపర్ లీకేజీల చేసి ర్యాంకులు తెచ్చుకుంటూ.. కష్టపడి చదివిన వాళ్లకు నష్టం జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీ విద్య వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. మంచి సందేశంతో ఈ చిత్రం తీశానని.. ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించాలని చేస్తున్న పేపర్ లీకేజీ కుట్రలు.. వాటి వల్ల నష్టపోయే అంశాలపై చిత్రం తీయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ, తరిమేల అమర్నాథ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కైలాష్ పాల్గొన్నారు. ఇలాంటి చిత్రాలకు ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించేలా బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.