Pydithalli Ammavari Sirimanu Tree Relocation: పైడితల్లి అమ్మవారి జాతర.. సిరిమానోత్సవానికి చెట్టు గుర్తింపు.. ప్రత్యేక పూజలతో తరలింపు - సనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 4:49 PM IST
Pydithalli Ammavari Sirimanu Tree Relocation: విజయనగరం పైడితల్లి సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ అంగరంగా వైభవంగా ప్రారంభమైంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అవసరమైన వృక్షాన్ని నెలిమర్ల నగరపంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో గుర్తించారు. ఈ వృక్షానికి స్థానికులతో పాటు.. ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం (నేడు) చెట్టు కొట్టి తరలించే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. సిరిమాను కోసం గుర్తించిన వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పైడితల్లి ఆలయ ఈవో సుధారాణి. చెట్టు కొట్టే ప్రక్రియను ప్రారంభించారు.
ప్రత్యేక పూజలతో సిరిమాను చెట్టుని భూదేవి నుంచి వేరుచేసే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలి రావటంతో.. ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారింది. సిరిమాను అధిరోహిత పూజారి వెంకటరావు, డిప్యూటీ స్పీకరట్ కోలగట్ల మాట్లాడుతూ.. పైడితల్లి అమ్మవారి మహోత్సవాల్లో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు.