ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protests_for_CBN_in_Canada_and_Bengaluru

ETV Bharat / videos

Protests for CBN in Canada and Bengaluru: అటు కెనడాలో.. ఇటు బెంగళూరులో..! బాబుకు మద్దతుగా కదంతొక్కిన తెలుగు ప్రజలు - protest against cbn arrest in canada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 12:26 PM IST

Protests for CBN in Canada and Bengaluru : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా ప్రాంతాలకు అతీతంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కెనడాలోని టొరంటోలో ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలనే నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు.. బెంగళూరు మహానగరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. బాబుతో మేము సైతం అని నినాదాలు చేస్తూ కనిగిరి నియోజక వర్గం నుంచి బెంగళూరుకు వలస వెళ్లిన కార్మికులు, ఐటీ ఉద్యోగులు, పలువు వ్యాపారస్తులు ర్యాలీలో పాల్గొన్నారు.  

జై బాబు జై జై బాబు, బాబుతో మేము సైతం, సైకిల్ రావాలి సైకో పోవాలి అని నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు చేతబట్టి మహానగరంలోని బాల్ చౌక్, కళ్యాణ్ నగర్ ప్రాంతాలలోని ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోరే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలులో ఉంచటం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఆయనను విడదల చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details