విశాఖ క్రెడాయి ప్రోపర్టీ షో - వినియోగదారులకు కావల్సినవి అన్ని ఒకే చోట - విశాఖ క్రెడాయి ప్రోపర్టీ షో
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 10:54 AM IST
Property Show in Visakha: ప్రపంచంలోనే అద్భుత నగరంగా విశాఖ అవతరిస్తున్న తరుణంలో క్రెడాయి, సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రోపర్టీ షోని నిర్వహించడం అభినందనీయమని టీటీడీ మాజీ ఛైర్మన్ వై. వీ. సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ క్రెడాయి పోపర్టీ షోను ఈ ఏడాది ఎంవీపీ కాలనీలోని గాది రాజు ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వై. వీ సుబ్బారెడ్డి, సాయికాంత్ వర్మలు పరిశీలించారు.
వినియోదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఒకే చోట కొలువుతీరిన వేదిక, విశాఖ క్రెడాయి ప్రోపర్టీ షో అని కార్యక్రమంలో పాల్గొన్న గృహ నిర్మాణ సంస్థల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోపర్టీ షో గత రెండు రోజులుగా ప్రజా స్పందనతో ఉత్సహంగా కొనసాగుతోంది. గృహా నిర్మాణానికి అన్ని ఒక ప్రదేశంలోనే సమకూరే విధంగా ఏర్పాటు చేసిన ప్రోపర్టీ షోలో, నిర్వాహకులను టీటీడీ మాజీ ఛైర్మన్ అభినందించారు.