ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థినికి టీసీ ఇచ్చి పంపిన ప్రిన్సిపాల్

ETV Bharat / videos

TC to student: ఫోన్​లో మాట్లాడిన విద్యార్థిని.. టీసీ ఇచ్చిన ప్రిన్సిపాల్ - బాలికల గురుకుల పాఠశాల

By

Published : Jul 19, 2023, 4:52 PM IST

principal gave TC student spoke on the phone: ఫోన్​లో మాట్లాడిందని పదో తరగతి విద్యార్థిని, రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణి ప్రీతికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో నార్పలకు చెందిన ప్రీతి పదో తరగతి చదువుతోంది. వారం క్రితం స్వగ్రామం నుంచి వచ్చిన ఓ మహిళ.. మీ తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ప్రీతితో చెప్పింది. దీంతో ఆ మహిళ ఫోన్​తో ప్రీతి తన తండ్రితో ఆరోగ్యం గురించి మాట్లాడింది. అనుమతి లేకుండా ఫోన్లో మాట్లాడినందుకు ప్రిన్సిపల్ వారం రోజుల పాటు తరగతులకు అనుమతించకుండా కార్యాలయ గదిలో ఉంచినట్లు ప్రీతి తెలిపింది. 'ఉన్నట్టుండి టీసీ ఇచ్చి బయటికి పంపించారు. ఇలా టీసీ ఇస్తే ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి' అంటూ ప్రీతి, ఆమె తండ్రి నాగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న తన బిడ్డకు అర్ధాంతరంగా టీసీ ఇచ్చి చదువు మాన్పిస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి తిరిగి నా బిడ్డను పాఠశాలలో చేర్పించుకోవాలని ప్రీతి తండ్రి అధికారులను వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details