ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI: శాంతి భద్రతలకు భంగంగా మారుతున్న ఘటనలపై చర్యలు ఉండవా..?

By

Published : Sep 5, 2022, 9:35 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాదంటే కట్టెలు, కొట్లాటలతోనే సమాధానం. ఎదురొస్తే మూక దాడులతోనే దౌర్జన్యం. ప్రాణాల మీదకు వచ్చినా పట్టించుకోరు. కన్ను పోయినా కనికరం లేదు. ఇదేంటయ్యా అని అడిగితే అబ్బే.. అదేమంత పెద్ద గొడవ కాదంటారు.. ఖాకీలు. నిన్నటి చెన్నుపాటి గాంధీ కన్ను పొడవడం దగ్గర్నుంచి... అన్న క్యాంటీన్ల ధ్వంసం వరకు! సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కుళ్లబొడవడం నుంచి... ఫ్లెక్సీలు పెట్టినందుకు పగ పెంచుకుని కొట్టడం వరకు! శాంతి భద్రతలకు భంగంగా మారిన ఇలాంటి ఘటనలపైనే పౌరసమాజం.., మానవహక్కుల సంఘాల్లో ఇప్పుడు ఆందోళన అంత. రాష్ట్రానికి తీవ్రస్థాయిలో అపప్రద తీసుకుని వస్తున్న ఈ ఉదంతాలపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇకనైనా చర్యలు తీసుకుంటారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details