ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani Debate on How Jagan Government Cheating farmers

ETV Bharat / videos

Prathidwani: చెప్పేదొకటి.. చేసేదొకటి.. జగన్​ తీరుతో నాలుగేళ్లుగా మోసపోతున్న రైతులు - వైఎస్సార్‌ రైతు భరోసా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 10:25 PM IST

Prathidwani: దేశంలో ఏ రాష్ట్రం చేయని మంచి.. రైతులకు మీ బిడ్డ చేస్తున్నాడని సీఎం జగన్‌ ప్రతి సభలో పదే పదే చెబుతుంటారు. రాష్ట్రంలో రైతన్నలకు గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సాయం చేస్తున్నామని.. తమది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని అంటారు. మరి... వైసీపీ ప్రభుత్వం చెప్పే రైతు సంక్షేమంలో అసలు నిజాలు ఏమిటి? వ్యవసాయానికి సంబంధించి రద్దు చేసిన పలు పథకాలు, ఎగ్గొట్టిన రాయితీలు, సబ్సిడీలే అందుకు సాక్ష్యం అంటూ రైతు సంఘాలు ఎంతోకాలంగా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్‌ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ పథకాలు అనేకం పెట్టామని ప్రభుత్వం చెబుతోంది కదా? మరి రైతు ఆత్మహత్యల్లో ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఎందుకు ఉంది? విత్తనాల నుంచి పంటల విక్రయం వరకు అన్నీ అవే ఆధారం అని  జగన్‌ సర్కార్‌ చెబుతున్న ఆర్బీకేల పని తీరు ఎలా ఉంది?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details