Prathidwani : విదేశీ విద్య.. వీసా చిక్కులు.. పొరపాటుకు మూల్యం ఎవరు చెల్లించాలి..?
Prathidwani Debate on Awareness on Foreign Education : ఎన్నో కలల్ని మోసుకుంటూ అమెరికా విద్యకు పయనమైన 21 మంది భారతీయ విద్యార్థులకు.. అక్కడ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. కోటి ఆశలతో అమెరికా విమానం ఎక్కిన వారిని.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపించారు. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను తిప్పి భారత్‌కు పంపించారు. చేతిలో వీసా ఉంది.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. అయినా పత్రాలు సరిగా లేవంటూ అమెరికా అధికారులు వారిని ఎందుకు నిర్భంధించారు? ఒకవేళ పత్రాలే సరిగా లేకుంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎలా వెళ్లగలిగారు? ఎవరి పొరపాటుకు ఎవరు మూల్యం చెల్లించాల్సి వస్తోంది? విదేశీ చదువుల విషయంలో గమనించాల్సినవేంటి? కన్సల్టెన్సీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఈ నేపథ్యంలో విదేశీ విద్య.. వీసా చిక్కులపై తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపైనే నేటి ప్రతిధ్వని.