ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani_Debate_on_Amma_Vodi_Scheme

ETV Bharat / videos

Prathidwani Debate on Amma Vodi Scheme: అమ్మఒడిలో కూడా జగనన్న కోత..! సాయం పెంచాల్సింది పోయి ఏటేటా తగ్గింపు..!

By

Published : Aug 5, 2023, 10:53 PM IST

Prathidwani Debate on Amma Vodi Scheme: పిల్లలను బడికి పంపిస్తే చాలు.. ఆ ప్రతి తల్లికి అమ్మఒడి పేరుతో ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానని ఊదరగొట్టిన జగన్‌.. ఏటేటా ఆ మొత్తం తగ్గిస్తున్నారు. సాయానికి వివిధ రూపాల్లో కోతలు పెడుతూ.. లబ్దిదారుల సంఖ్య తగ్గించుకుంటూ వెళ్తూ.. నిధులు మిగుల్చుకుంటున్నారు. హామీ ఇచ్చిన 15 వేలు ఇప్పటికే 13 వేలకు తగ్గిపోగా.. ఇప్పుడు కొంతమందికి 9 వేలు, మరికొందరికి 11 వేల రూపాయల చొప్పునే జమ కావడంతో లబ్దిదారులు ఆందోళనకు గురి అవుతున్నారు. వీటికి తోడు వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో 5 సార్లు పథకం లబ్ధి చేకూర్చాల్సి ఉండగా.. హాజరు పేరుతో ఏకంగా ఏడాది మొత్తం ఎగవేతకు ప్రణాళిక వేశారన్న విమర్శలూ దుమారం రేపుతున్నాయి. అసలు అమ్మఒడిపై జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారు? సాధారణంగా ఏ పథకానికైనా సాయం పెంచుతారు.. అమ్మఒడికి మాత్రం తగ్గుతూ రావడాన్ని ఎలా చూడాలి? పేదవాడిపై ప్రేమకు నిదర్శనం అమ్మఒడి అన్న సీఎం.. ఆ పేదవాడికిచ్చే సాయం ఎందుకు లాక్కుంటున్నారు? ఏటికేటా లబ్దిదారుల ఎంపిక కఠినతరం చేస్తూ.. ప్రతి సంవత్సరం నిబంధనలు మార్చడం ఎందుకు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details