ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

Prathidhwani: తాత్కాలిక వసతి ముసుగులో.. మరో డ్రామాకి తెర లేపిన వైసీపీ సర్కార్ - ఏపీ రాజధానిగా విశాఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 10:16 PM IST

Prathidhwani: రాజధాని విషయంలో మరో డ్రామాకి తెర లేపింది జగన్ ప్రభుత్వం. అమరావతిని దాటి.. తాత్కాలిక వసతి ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారికంగా విశాఖకు మార్చేందుకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారడంతో... సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు, వివిధ శాఖల కార్యాలయాల్ని అడ్డదారిన ఏర్పాటు చేయబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసం ఈ కార్యాలయలన్నీ అంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు ఏలినవారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్ట తీర్పు ఉన్న పరిస్థితుల్లో కూడా జగన్‌ ప్రభుత్వం ఈ చర్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు అమరావతిలో లేని సౌకర్యాలు ఏమిటి? అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం, అందులో పనిచేసే వారికి నివాసాలన్నీ అక్కడ కొలువుదీర్చారు. అవన్నీ నిరుపయోగంగా వదిలి పెట్టి వందల కోట్లు ఖర్చు పెడుతూ... అది కూడా రుషికొండ వెంట పరుగులెందుకు? అలుపెరగని ఉద్యమం చేస్తున్న అమరావతి రైతుల ముందు ఇప్పుడు ఉన్న మార్గం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details