ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 1:47 PM IST

Police_Traced_Kidnapped_Boy_Information

Police Traced Kidnapped Boy Information: ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 25న కిడ్నాప్ అయిన నాలుగేళ్ల బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. ఓ మహిళ తీసుకువెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, ఆ బాలుడిని క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్​లో నివాసముంటున్న తిరుపతమ్మ అనే మహిళ అనారోగ్యంతో పది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు తన కుమారుడు కూడా ఆసుపత్రిలోనే ఉంటున్నాడు.

Kidnap Case in Nellore: క్రిస్మస్ రోజు నుంచి తన కుమారుడు కనిపించడం తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో నివాసముంటున్న శాంతి అనే మహిళ దగ్గర బాలుడి ఆచూకీ గుర్తించారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బాలుడిని తన తల్లి వద్దకు చేర్చారు. అపహరణ వెనుక ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details