ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_on _Municipal_Workers

ETV Bharat / videos

మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ఉక్కుపాదం - ఈడ్చుకెళ్లిన వైనం, స్పృహతప్పి పడిపోయిన మహిళ - కార్మికులపై పోలీసుల తీరు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 3:16 PM IST

Police Stopped Municipal Workers Protest: హక్కుల కోసం గళమెత్తిన మున్సిపల్‌ కార్మికులపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళలు, పెద్ద వయసు వారనే కనికరం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులంతా మూకుమ్మడిగా లాగిపడేశారు. ఈ సమయంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. చాలాసేపు ఆమె కదలకుండా అలాగే ఉండిపోవడంతో ఏం జరిగిందో తెలియక తోటి కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందారు. 

ఆ తర్వాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికులు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. గద్దెనెక్కకముందు అక్కచెల్లెమ్మలు అంటూ అభిమానం ఒలకబోసిన జగన్‌ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే డబ్బులు లేవని చెప్పడం దారుణమన్నారు. హామీలు నెరవేర్చకపోగా పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details