ఆంధ్రప్రదేశ్

andhra pradesh

police_says_woman_try_to_suicide_attempt_in_marripadu

ETV Bharat / videos

ఆస్తి పంపకాల వివాదం - పోలీసులు మందలించడంతో మహిళ ఆత్మహత్యాయత్నం - woman try to suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 9:56 AM IST

Police Tells Women Try To Suicide Attempt In Marripadu: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామంలో ఆదెమ్మ అనే గిరిజన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె ప్రస్తుతం ఆత్మకూరు జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన ఆస్తి వివాదంలో పోలీసులు మందలించడం వల్ల ఆదెమ్మ పురుగులు మందు తాగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదెమ్మకు భర్త, పిల్లలు లేకపోవడంతో ఆమె బాగోగులు అన్ని అన్న కొడుకులైన హజరతయ్య, వినయ్ కుమార్​లు చూసుకుంటున్నారు. అదెమ్మకు ఉన్న ఇల్లుని ఆ ఇద్దరికి రాసి ఇచ్చింది. ఆదెమ్మ చెల్లెలు అంకమ్మ ఆ ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు సగం డబ్బులు నేను ఇచ్చానంటూ..ఆ ఇంటిలో నాకు వాటా ఉందంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వాళ్లిద్దరినీ పిలిపించిన సంగం సీఐ రవి నాయక్ గ్రామస్థుల సమక్షంలో ఆ ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు సగం డబ్బులు ఇచ్చినందున చెరో సగం పంచుకోవాలని లేదంటే అంకమ్మ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పెద్దల సమక్షంలో నచ్చచెప్పి పంపించామన్నారు. మేము ఎవరిని దూషించడం, బెదిరించడం లాంటివి చేయలేదంటూ సంగం సీఐ రవి నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details