Polavaram Right Canal Issue : వాన జోరు.. అక్రమ తవ్వకాల హోరు.. పోలవరం కుడి కాలువకు గండి - central polavaram project
Polavaram Right canal Gandi :కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గండి పడింది. ఇప్పటికే కాలువకు ఇరువైపులా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలువపై నుంచి భారీగా వచ్చిన వరద ధాటికి వీరపనేనిగూడెం కొత్తగూడెం మధ్య దారి తెగిపోయింది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్రమ తవ్వకాల వల్లనే భారీ గండి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఉన్న అరకొర రహదారి కాస్త సాయంత్రానికి కొట్టుకుపోయింది. దీంతో ఆ దారిలో రాకపోకలు సాగించే రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు అధికారులు జాప్యం వహిస్తున్నారని.. వారి తీరుపై ఇరుగ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చీమలవాగు, ములగలమ్మ చెరువు పర్యవేక్షణ కొరవడటంతో కాలువలోకి భారీ వరద చేరుతోందని తెలిపారు.